అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా పలు వాణిజ్య సంబంధాలపై చర్చలు జరగనున్న సంగతి తెల్సిందే.ఇండియా పర్యటనలో ఉన్న ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు.
ఈ సందర్భంగా ట్రంప్ “అద్భుతమైన ఈ పర్యటన ఏర్పాటు చేసిన నా గొప్ప మిత్రుడు మోదీకి కృతజ్ఞతలు”అని సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో రాసిన సందేశం ఇది.
ఆయన గాంధీ గురించి ఏమి రాయలేకపోవడం గమనార్హం. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ కు వచ్చినప్పుడు గాంధీ కేవలం భారతదేశానికే కాదు.
ప్రపంచం మొత్తానికి హీరో.. గాంధీజీ స్ఫూర్తి నేటి భారతదేశంలో సజీవంగా ఉంది. అది ప్రపంచానికే గొప్ప కానుక అని రాసిన విషయాన్ని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.