గతంలో రాజధాని భూములు కొల్లగొట్టేందుకు టీడీపీ చేసిన దుశ్చర్యలకు అప్పట్లో సురేష్ ఎదురు నిలిచిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఉద్దేశపూర్వకంగా కొందరు కిరాయి మనుషులతో ఇప్పిటికి రెండుసార్లు దాడికి పాల్పడటం సంచలనం రేపుతుంది. అమరావతి రైతుల ఆందోళనలు దారి తప్పాయి..టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజికవర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను టార్గెట్ చేస్తూ అమరావతి ఆందోళనకారుల ముసుగులో టీడీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. తాజాగా జరిగిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడిని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో నందిగం సురేష్‌పై రెండో సారి దాడి చేయడం దారుణమన్నారు. ఈ దాడి వెనుక నూటికి నూరుపాళ్లు చంద్రబాబు హస్తం ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగానే దాడులు చేసినప్పటికీ పోలీసులు చాలా ఓపికతో సమన్వయం పాటిస్తున్నారని తెలిపారు. ఇక అమరావతి రిలే నిరాహార దీక్షల్లో కొన్ని అసాంఘిక, కుట్రపూరిత శక్తులు చేరాయని విమర్శించారు. అమరావతి దీక్షలు చేయడానికి తణుకు నుంచి కూడా డబ్బులిచ్చి జనాన్ని తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇటువంటి చర్యలు మానుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కాగా గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు మహిళలతో ఎంపీ నందిగం సురేష్‌పై, ఆయన గన్‌మెన్, అనుచరులపై దాడి చేయించిన విషయం తెలిసిందే.
