భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ పై నెటిజన్లు ఎటాక్ చేస్తోన్నారు. ఇందులో భాగంగా నమస్తే ట్రంప్ సభలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో కొన్ని పేర్లను తప్పుగా పలకడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు.
మోదీని చాయ్ వాలా పుత్రుడిగా పేర్కోనే క్రమంలో సన్ ఆఫ్ చివాలా గా వేదాలను ద వేస్తాస్ గా ,స్వామి వివేకానందను వివేకమనసన్ గా ఉచ్చరించారు. హిందీ షోలే సినిమాను షోజేగా ,దిల్ వాలే దుల్హానియా లేజాయేంగేను డీడీఎల్జేగా పలికారు. దీంతో నెటిజన్లు సెటైర్లు వేస్తోన్నారు.