యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ వచ్చిన తరువాత దీన్ని చూసి అన్ని దేశాలు లోకల్ లీగ్స్ పెట్టడం జరిగింది. కాని ఎన్ని వచ్చినా ఐపీఎల్ ప్రత్యేకతే వేరని చెప్పాలి. దీనికోసం ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఫుల్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బాట్స్మెన్ మరియు హిట్టర్ జాస్ బట్లర్ మాటల్లో వింటే” ఐపీఎల్ టీ20 ప్రపంచ కప్ కు ఒక మంచి ప్లాట్ ఫామ్ అని చెప్పారు”. ఆ మాటలు అక్షరాల నిజం అని చెప్పాలి. ఈ ఐపీఎల్ తో ఎందరో ఇప్పుడు టాప్ లెవెల్ లో ఉన్నారు.
