అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్ కానుకలు అందించనున్నారు. నేడు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా కోవింద్ ట్రంప్ గౌరవార్థా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి కోవింద్ స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపించిన సంగతి తెలిసిందే . ఈ విందుకు ప్రత్యేక ఆహ్వాని తుడిగా కేసీఆర్ హాజరుకాను న్నారు. ఇందుకోసం ఆయన మంగళ వారం ఢిల్లీ వెళ్లనున్నారు. కార్య క్రమంలో ఆయన ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటో అందించనున్నారు. మెలానియా, ఇవాంకలకు పోచంపల్లి, గద్వాల చీరలను బహూకరించనున్నారు.
