దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నేడు కూడా సీఏఏ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో హింసాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి.
ఇక శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ,ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ,సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే నిన్న జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది.