జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ పార్టీపై ఏవేవో పుకార్లు సృష్టించింది. అన్ని రకాలుగా ప్రతీఒక్కరిని రంగంలోకి దింపి చివరికి ఏమీ చెయ్యలేక పరువు పోగొట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా అందరిని భరిలోకి దింపిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికి మహిళలను కూడా ప్రయోగించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా 40 ఏళ్ల అనుభవం అంటే? ప్రజలు అధికార పీఠం నుంచి విసిరి కొట్టినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్ర పన్నడం తప్ప రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశావా? ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి” అని అన్నారు.