Home / ANDHRAPRADESH / ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం.. సీఎం జగన్ ఆగ్రహం

ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం.. సీఎం జగన్ ఆగ్రహం

విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్నవారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదని, ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకు ఏకైక మార్గం, వారూ పెద్ద చదువులు చదవాలన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. పేదపిల్లలు మంచి ఉద్యోగాలు పొందాలి.. వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలి, అప్పుడే పేదరికం పోతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ 33శాతం నిరక్షరాస్యులున్నారు. అదే సమయంలో దేశంలో అది 27శాతం మాత్రమే, అంటే జాతీయస్థాయి కంటే దిగువన మనం ఉన్నాం.. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) కూడా కేవలం 23శాతమే ఉంది. ఈ పరిస్థితి మారడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టాం.. అందులో భాగంగా ఇవాళ ఇక్కడినుంచి వసతి దీవెన ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నాను.. ఏటా రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పేద విద్యార్థులకు రూ.20 వేల వరకు హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ఇస్తాం..

 

 

జనవరి, ఫిబ్రవరిలో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తాం.. వీరే కాకుండా ఐటిఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు కూడా రెండు విడతల్లో రూ.15 వేలు ఇస్తాం.. ఒక కుటుంబంలో ఎందరు పిల్లలు చదివినా అందరికీ ఇస్తాం.. దాదాపు 11.87 లక్షల మంది పిల్లలకు ఒక బటన్‌ నొక్కగానే, ఆయా మొత్తాల్లో సగం ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా దాదాపు రూ.1100 కోట్లు జమ అవుతాయి.. వసతి దీవెన కోసం ఏటా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తుండగా, విద్యా దీవెన కోసం ఏటా మరో రూ.3700 ఖర్చు చేయబోతున్నామన్నారు. నాడు–నేడు మనబడి ద్వారా మూడేళ్లలో అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చబోతున్నాం.. మధ్యాహ్న భోజన మెనూలో పూర్తి మార్పులు తెచ్చాం.. ప్రతి పిల్లవాడు చదవడమే కాదు, భావి తరంతో పోటీ పడాలి..

 

 

కానీ ఈ ప్రభుత్వంపై రోజూ కొందరు విమర్శలు చేస్తున్నారు. వారిని ఏమనాలో మీరే ఆలోచించాలి.. తమను ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారు.. వారిని ఏమనాలో మీరే ఆలోచించమని కోరుతున్నాను.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీల్లేదని, దాడులు చేస్తున్న మూకలను ఏమనాలి అని చెప్పి, ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.. ప్రజలు ఇచ్చిన బలంతో, దేవుడి దయతో ఇక మీదట కూడా ముందడుగులు వేస్తామని ఈ వేదిక నుంచి మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.. దేవుడి దయ చాలా కావాలి. ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం.. యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క ప్రతిపక్షంతోనే కాదు.. ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నామంటూ జగన్ చెప్పుకొచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat