అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన అనంతరం నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం అక్కడ అన్ని సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నూలుమాల వేసారు. అనంతరం చరకా తిప్పారు. చివర్లో ట్రంప్ దంపతులు సందర్శకుల పుస్తకంలో సంతకం చేయడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని సందర్శించడం ఒక మంచి అనుభూతి అని రాసారు.
