అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ పర్యటనకు ముందు ట్రంప్ ఆయనను ఆహ్వానించదానికి కోటిమంది వస్తారని చమత్కారంగా మాట్లాడారు. అయితే కోటిమంది లేకపోయినా లక్షల్లో ప్రజలు ట్రంప్ ని రోడ్డు పొడువునా ఘనస్వాగతం పలుకుతున్నారు.
