తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల రాజధాని గ్రామాల కంటే కాస్తో కూస్తో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా తాడేపల్లే.. కానీ తాడేపల్లిలో ఏ విధమైన ధర్నాలు లేవు, ఎలాంటి ఆందోళనలు లేవు.. అక్కడి ప్రజల్లో కొంత బాధ ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్ దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్న మంచి ఆలోచన వారిలో ఉంది. అలాగే కచ్చితంగా త్వరలోనే మళ్లీ ఈ ప్రాంతం వైభవాన్ని చూడకమానదు అన్న ఆలోచన వారిలో ఉంది. కానీ రాజధాని గ్రామాల్లోని ఒక వర్గం మాత్రం అనుకున్నది సాధించడానికే దేనికైనా తెగించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే ఏదో సాధించలేకపోయామన్న నిర్వేదంలో ఆ వర్గం మరింత పైశాచికత్వానికి తెగబడే అవకాశం కనిపిస్తోంది.
ఈ క్రమంలో దాడులు, మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఎమ్మెల్యే రోజా, ఎంపీ సురేష్ లపై దాడులు ఈ విధంగానే చూడొచ్చు. ఈక్రమంలో భవిష్యత్ లోనూ వీరు విధ్వంసాలకు పాల్సడే అవకాశమూ లేకపోలేదని పలువురు చెప్తున్నారు. భద్రతా సమస్యలు తలెత్తకుండా అసెంబ్లీని తాడేపల్లి వైపునకు తీసుకురావాలని తాడేపల్లికి అన్ని విధాలుగా కనెక్టివిటీ ఉండడంతో ప్రజా ప్రతినిధులకు భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉండదని చెప్తున్నారు. అలాగే ప్రస్తుత రాజధానిలోని పలు గ్రామాలు, అక్కడి భూములు వ్యవసాయ భూములు కాబట్టి వాటిని మరింత అనువుగా తీర్చిదిద్ది, ఫుడ్ ప్రాసెస్సింగ్ కేంద్రాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు నెలకొల్పితే బాగుంటుందనే సూచనలు ప్రభుత్వానికి వినిపిస్తున్నాయి. ఇవికూడా అత్యంత ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నాయి.