దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఉన్నతాశయంతో సీఎం వైఎస్ జగన్ నవరత్నాలు పథకం లో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టాడు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదల బతుకు మారలేదని.. నిరుపేదల జీవితాలలో మార్పులు రావాలని ఆకాక్షించారు. పేదల బతుకులు మారాలంటే వారి కుటుంబాలలో ఎవరో ఒకరు ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాలన్నారు. ఇందులో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను కర్నూల్ జిల్లా పత్తికొండ ప్రభుత్వ కళాశాలలో వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి జగనన్న విద్య అర్హత కార్డులను అందజేశారు. అనంతరం గత ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు చేసుకున్న 48 కుటుంబాలకు 1.96 కోట్లు చెక్కులను బాధిత కుటుంబాలకు శ్రీదేవమ్మ అందజేశారు. ఈ విదంగా స్థానిక ప్రజలు మాట్లడుతూ మా పత్తికొండ లో మరో 20 ఏళ్లు నువ్వే మా ఎమ్మెల్యేగా ఉండాలని..ధీవీస్తూ అందుకే కెయి కృష్ణమూర్తికి ఓటు వెయ్యలేదని స్వయంగా ప్రజలే ఎమ్మెల్యే శ్రీదేవితో చెప్పారంట . ఈ కార్యక్రమంలో ఎండిఓ , ఈఓ , వ్యవసాయ అధికారులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.