ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు..టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర టీడీపీ నేతల చావుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 9 నెలల పాలనపై నవ మోసాల పాలన అంటూ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర చేపట్టి తొలుత ప్రకాశం జిల్లాలో పర్యటించాడు. పాపం బాబుగారి యాత్రకు జనాలు దండిగా తరలించాలని..అమరావతి నుంచి జిల్లా నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో టీడీపీ నేతలు పడుతూ లేస్తూ..డబ్బులు కుమ్మరించి జనాలను ఓ మోస్తరు వరకు బాగానే తరలించారు. అయినా చంద్రబాబు గారు సాటిస్‌ఫై కాలేదు..అందుకే రోషం లేదా.. నేనొస్తుంటే…మీరందరూ ఇండ్లలో కూర్చుంటారా అంటూ జనాలపై అసహనం వెళ్లగక్కాడు. ఇక మందుబాబులను వెనకేసుకువస్తూ.. తమ్ముళ్లు..మద్యం రేట్లు పెరిగాయా లేదా…అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా…ఏదో బలహీనతతో పెగ్గేసుకునేవాళ్లకు ఈ పనిష్మెంటేంటీ అంటూ..చంద్రబాబు అనేసరికి తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు.. ఇప్పుడు మద్యం తాగడం తక్కువైందని..మహిళలు ఆనందపడుతుంటే…టీడీపీ అధ్యక్షుడై ఉండి మా బాబుగోరు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడి పరువు తీస్తున్నారని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ యాత్రలకు జన సమీకరణకు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు చేతి ఖర్చు బాగా వదిలిందని లబోదిబోమంటున్నారు. మొన్నటి ఎలక్షన్ల దెబ్బకు ఇంత వరకు కోలుకోలేదు..మళ్లీ ఈయన 9 నెలల్లోనే యాత్రలు మొదలెట్టాడు.. జనాలను తరలించమంటాడు..ఇదెక్కడి చావురా అంటూ..టీడీపీ నేతలు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు.
అయితే తాజాగా అనంతపురం జిల్లా టీడీపీ నేతలు మాత్రం ప్రజా చైతన్యయాత్ర మా జిల్లాలో వద్దు..కావాలంటే పక్క జిల్లాకు వెళ్లి మీకు ఇష్టం వచ్చినన్ని నియోజకవర్గాలు తిరగండి..మేమే వచ్చిపోతాం..మా దగ్గరకు మాత్రం రాకండి అంటూ బాబుగారిని వేడుకుంటున్నారంట..చంద్రబాబు అమరావతి ఆందోళలను నడిపిస్తూ.. రాయలసీమలో రాజధాని ఏర్పాటుపై విషం కక్కడంపై సీమ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రకు సిద్ధం కావడంతో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. డబ్బులు ఇచ్చి తరలిద్దామన్నా జనాలు వచ్చే పరిస్థితి లేదని..ఏదో తంటాలు పడి తరలించినా.. ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని.. అలాంటప్పుడు అనవసరంగా యాత్రకు అయ్యే ఖర్చును ఎందుకు భరించాలనే భావనతోనే…. చంద్రబాబును రావద్దని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పరువు పోతుందని భావించిన నేతలు… కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా యాత్ర చేపట్టి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల నేతలను ఒప్పించేపనిలో పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో చంద్రబాబు నేనొస్తానంటే..మీరొద్దంటారా అంటూ తెలుగు తమ్ముళ్లపై కస్సుబుస్సులాడుతున్నాడంట..మొత్తంగా చంద్రబాబును తెలుగుతమ్ముళ్లే రావద్దన్న వార్తలు అనంతపురం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.