ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్‌లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై గత అక్టోబర్‌లో ఎల్విన్‌మెంట్ పీఎస్‌లో మంత్రి ఫిర్యాదు చేశారు. పుష్ప శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.