టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ మద్యం రేట్లపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ మందుబాబులను వెనకేసుకువచ్చారు. ఏం తమ్ముళ్లు..మద్యం రేటు పెరిగిందా..పెరిగిందా లేదా..కావాల్సిన బాండ్లు ఉన్నాయా లేదా..ఏదో ఒక బలహీనతతో ఒక పెగ్గేసుకునేవాళ్లకు..ఈ పనిష్మెంట్ ఏంటీ..ఈ శిక్ష ఏంటీ అని అడుగుతున్నా అంటూ రంకెలు వేసాడు. దీంతో బాబుగారు టీడీపీ అధ్యక్షుడా..లేక తాగుబోతుల సంఘం అధ్యక్షుడా అంటూ నెట్జన్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు చేసిన విమర్శలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. మద్యం ధరలు పెంచి మందు బాబుల పొట్ట కొడుతున్నారని రంకెలేస్తాడు..అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగు పైనా దర్యాప్తు జరపొద్దంటాడు.. తన మాజీ పీఎస్ ఐటీ దాడుల్లో అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటాడు… ఏమైంది ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?’ అంటూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక పీపీఏలపై బాబు చేసిన విమర్శలపై మాట్లాడుతూ… పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వమనుకుంటే అడ్డుపడతాడు అంటూ మండిపడ్డారు.. కమీషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని ఏపీ ట్రాన్స్ కోకు 70 వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్లాడు బాబు. ఈ పీపీఏల దళారి ఎవరంటే కిరసనాయిలు… అక్రమ సంపాదన ఆగిపోయిందనే సీఎం జగన్ గారిని పీపీఏల రద్దుపై ప్రధాని మోదీ నిలదీశారని బోగస్ వార్త రాశాడు’..అంటూ పచ్చ మీడియా రాతలపై విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మొత్తంగా మద్యం రేట్లపై పీపీఏలపై, ఇన్సైడర్ ట్రేడింగ్, ఐటీ దాడులపై చంద్రబాబు చేసిన విమర్శలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టిర్ వేదికగా తిప్పికొట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
