Home / ANDHRAPRADESH / ఈఎస్‌ఐ స్కామ్‌లో పక్కా ఆధారాలతో దొరికిన ఇద్దరు టీడీపీ మాజీమంత్రులు..విజిలెన్స్ ఎస్సీ..!

ఈఎస్‌ఐ స్కామ్‌లో పక్కా ఆధారాలతో దొరికిన ఇద్దరు టీడీపీ మాజీమంత్రులు..విజిలెన్స్ ఎస్సీ..!

ఒక పక్క అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ, ఈడీ దర్యాప్తులు, 2 వేల కోట్ల హవాలా స్కామ్, మరోపక్క కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ 400 కోట్ల హవాలా స్కామ్‌పై ఐటీ శాఖ, ఈడీ విచారణలు , ఈఎస్‌ఐ స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ…ఇలా వరుస స్కామ్‌ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, లోకేష్‌తో పాటు టీడీపీ మాజీమంత్రుల అడ్డంగా ఇరుక్కుంటున్నారు. తాజాగా ఏపీలో సంచలనం రేపుతున్న ఈఎస్‌ఐ స్కామ్‌లో టీడీపీ మాజీమంత్రి అచ్చెంనాయుడితోపాటు, మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మెడచుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈఎస్‌ఐ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు.  ఈఎస్‌ఐ స్కామ్‌లో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులకు ప్రమేయం ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని ఎస్సీ  తెలిపారు. ముఖ్యంగా మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్లు, టెలీహెల్త్ సర్వీసెస్ అంశాలలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. టెలీసర్వీసెస్‌కు చెందిన కాల్‌లిస్ట్‌ ఏపీది కాకుండా తెలంగాణాది ఇచ్చారని.. ఆ కాల్‌లిస్టును పరిశీలించగా బోగస్‌ అని తేలిందన్నారు. పేషెంట్స్‌ ఫోన్లు చేయకున్నా చేసినట్లు బిల్లులు చూపించారని ఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. సీవరేజ్‌ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, ఆదోనిలోని ఆస్పత్రిని మార్చినా.. పాత ఆస్పత్రిలోని ప్లాంట్‌ పేరుతోనే బిల్లులు పొందారని తెలిపారు. ఇందుకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు చేశారని పేర్కొన్నారు.

 

ఇక ఏపీ ఈఎస్‌ఐలో ‘నకిలీ కొటేషన్స్ పెట్టి కాంటాక్ట్ దక్కించుకున్నారని, అవసరానికి మించి మందులు కొని వాటిని వినియోగించలేదని, చాలా ఆసుపత్రుల్లో డ్రగ్స్ గోడౌన్స్‌కే పరిమితమయ్యాయని ఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. చెల్లింపుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించి…భారీ అవినీతికి పాల్పడ్డారని ఇందుకు సంబంధించి మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపించామని ఆయన అన్నారు. మూడు నెలల పాటు విచారణ జరిపాం. గత ఐదు సంవత్సరాలలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారు. ఓ మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉంది. అక్రమాలకు పాల్పడ్డ వారి మీద క్రిమినల్‌ కేసుల నమోదుకు సిఫారసు చేశాం. వారిపై కేసులు నమోదు కావడం ఖాయం అని వెంకట్‌రెడ్డి ప్రకటించారు. కాగా ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెంనాయుడు ప్రధాన నిందితుడని సీనియర్‌ న్యాయవాది పొనక జనార్ధన్‌రెడ్డి అన్నారు. అలాగే ఈ స్కామ్‌లో మరో మాజీమంత్రి పితాని పాత్రపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెంనాయుడు అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా ఈఎస్‌ఐ స్కామ్‌లో పక్కా ఆధారాలతో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులు దొరికిపోవడం టీడీపీలో కలకలం రేపుతోంది. దీంతో రోజుకో స్కామ్‌ బయటపడుతోంది..నెక్ట్స్ ఎవరి వంతు వస్తుందో అంటూ టీడీపీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat