తెలుగువారికి ఇష్టమైన వంటకం…పప్పు. ఎన్ని కూరలు ఉన్నా రోజు భోజనంలో పప్పు లేకపోతే అస్సలు తిన్నట్లు ఉండదు..అయితే ఇప్పుడు పప్పు అనగానే…టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్రరత్నం నారాలోకేష్ గారు గుర్తుకువస్తారు. పాపం నాలికమందంతో జయంతిని వర్థంతి అన్నా , మంగళగిరిని మందలగిరి అన్నా..డెంగ్యూ జ్వరాన్ని అదేదో నోటితో పలకలేని బూతుపదంతో అన్నా…ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి, వర్గ పిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశమే అవునా కాదా అన్నా…సైకిల్‌కు ఓటేస్తే మనకు మనం ఉరి వేసుకున్నట్లే అని సొంత పార్టీ పరువు తీసినా.. మజ్జిగలో ఏం వేసావు..పంచదారా…తియ్యగుంది..అంటూ కామెడీ చేసినా.. అది లోకేష్ బాబుకే చెల్లింది.
కొద్దిగా అమాయకత్వం, తెలుగు భాషపై పట్టులేకపోవడం, అనర్గళంగా మాట్లాడలేకపోవడం లోకేష్‌ను నవ్వుల పాలు చేసింది. లోకేష్ టింగరి చేష్టలు చూసి ప్రత్యర్థులు పప్పు అంటూ సెటైర్లు వేయడం మొదలెట్టారు. ఇక సోషల్ మీడియాలో కూడా లోకేష్‌ను పప్పు అంటూ నెట్‌జన్లు తెగ ట్రోలింగ్ చేస్తుంటారు.. ఆఖరకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా పప్పులాంటి అబ్బాయి అంటూ ఏకంగా తన సిన్మాలో పాట పెట్టేసి..తండ్రీకొడుకుల పరువు తీసాడు. లోకేష్‌ను పప్పుతో పోలుస్తూ వచ్చిన మీమ్స్‌కు ఇక లెక్కే లేదు. చివరకు గూగుల్‌లో తెలుగు పప్పు, ఏపీ పప్పు, ఆంధ్రప్రదేశ్, చివరకు pappu పప్పు అని టైప్ చేస్తే లోకేష్ ఫోటో వస్తుంది.
.గత కొన్నేళ్లుగా అందరూ తనను పప్పు అంటుంటే భరిస్తూ వచ్చిన చినబాబుకు ఇక ఓపిక నశించింది…అందుకే పప్పు పదం టైప్ చేస్తే తన ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలని లోకేష్ గూగుల్ సంస్థను కోరినట్లు సమాచారం. గతంలో కూడా పలుమార్లు పప్పు అని టైప్ చేస్తే తన ఫోటో రాకుండా చూడాలని లోకేష్ గూగుల్‌ను రిక్వెస్ట్ చేశాడు.అయితే ఇప్పుడు ఏకంగా కొందరు సెర్చ్ నిపుణులతో మీటింగ్ పెట్టి…. పప్పు అంటే తన ఫొటోలు – పేరు రాకుండా చర్యలు చేపట్టాలని గూగుల్ కంపెనీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పప్పు వార్త నిజమో కాదో ఇంకా తెలియాల్సి ఉంది..మొత్తంగా అందరూ తనను పప్పు అంటూ ఆడుకోవడంతో చిన్నబుచ్చుకుంటున్న చినబాబు ఆఖరకు గూగుల్ తల్లిని ఈ ట్రోలింగ్ బారి నుంచి కాపాడమని బతిమాలుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది..పాపం చినబాబుకు ఎప్పుడు వదులుతాయో ఈ పప్పు కష్టాలు.