మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఏపీ పంచారామాలతో పాటు అనేక ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మహాశివుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలన్నీ అంది..సుఖంగా, సంతోషంగా ఉండాలని, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి, పాడిపంటలు, సంపద వృద్ధి చెందాలని ఆకాక్షించారు. ఆ పరమశివుడు తన అనుగ్రహం ఎల్లవేళలా ప్రజలందరిపై ఉంచి సుఖసంతోషాలను, అపారమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు అంటూ వైవి సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.