సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని కీసర రామలింగేశ్వరస్వామిని కోరినట్లు ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Prayed the #LordShiva at Keesara Ramalingeshwara Swamy temple who hold #Ganga on head, to bestow his choicest blessing on our #LegendKCR garu, who brought the Ganga to the every household of #Telangana.#OmNamahShivay#HappyMahaShivratri#MissionBhagiratha #KaleshwaramProject pic.twitter.com/PLzXua6kAR
— Santosh Kumar J (@MPsantoshtrs) February 21, 2020
అనంతరం మంత్రి మాల్లారెడ్డి మాట్లాడుతూ.. కీసరగుట్ట తన నియోజకవర్గంలో ఉండటం తన పూర్వజన్మ సుకృతమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు పాడిపంటలతో, సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.