కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ‘భారతీయుడు-2’. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై లో పూంతమల్లి పక్కన ఉన్న నజరత్పేట్లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో కృష్ణ (కో డైరెక్టర్), చంద్రన్(ఆర్ట్ అసిస్టెంట్), మధు(ప్రొడక్షన్ అసిస్టెంట్). మరో 10మందికి తీరవ గాయాలు అయ్యాయి. ఇక డైరెక్టర్ శంకర్ కి కాలికి గాయం అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఆ ముగ్గురి కుటుంబాలకి కమల్ హాసన్ కోటి రూపాయలు ఇచ్చారు. ఎంతో దయాగుణంతో ఆయన చేసిన పనికి అందరు అభినందిస్తున్నారు.