ఐటీ దాడుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ హడావుడిగా తమ కుటుంబ ఆస్తులను ప్రకటించాడు. తన తండ్రి చంద్రబాబు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, గత ఏడాది కంటే ఈ ఏడాది మా నాన్నగారి ఆస్తి 87 లక్షల రూపాయలు పెరిగినట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక తన తల్లి సతీమణి నారా భువనేశ్వరి ఆస్తి 50 కోట్లని, తనకు 8.14 కోట్ల ఆస్తులు, తన భార్య బ్రాహ్మణికి 15.68 కోట్ల రూపాయలు, తన కుమారుడి దేవాన్ష్ కు 19.42 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు లోకేష్ తెలిపారు. అలాగే 2014 మార్చిలో రాజధాని పరిధికి 30 కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్ కోసం భూములు కొన్నామని అంతేకాని…అమరావతిలోని 29 గ్రామాల్లో తన కుటుంబానికి ఒక్క గజం భూమి కూడా లేదని లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు ఆస్తి 9 కోట్ల రూపాయలే అని ప్రకటించడంపై సర్వత్రి విస్మయం వ్యక్తమవుతుంది.వరుసగా తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నామని చెబుతున్నా..ఎప్పుడూ కూడా చంద్రబాబు తన పేరు మీద హెరిటేజ్ కాదు కదా ఏ కంపెనీ షేర్లు ఉన్నట్లు చూపించలేదు. కానీ గురువారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తుల ప్రకటనలో చంద్రబాబు తన మనవడికి 26,640 హెరిటేజ్ షేర్లను బదలాయిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
అయితే తాజాగా చంద్రబాబు నా ఆస్తి లక్ష కోట్లు అని చంద్రబాబు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుమోదీ, జగన్, కేసీఆర్ కుమ్మక్కై ఏపీకి ద్రోహం చేస్తున్నారంటూ… పదేపదే విమర్శలు గుప్పించారు. రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుది ఒకటే ఎజెండా..మోదీ, జగన్, కేసీఆర్‌లను తిట్టి ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి…రాజకీయంగా లబ్దిపొందాలని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో కేసీఆర్‌ను తిట్టబోయి తన ఆస్తి లక్ష కోట్లు అని మనసులో ఉన్నది కక్కేశాడు..ఇంతకీ ఆ వీడియోలో చంద్రబాబు ఏం మాట్లాడాడో మీరే చూడండి..తమ్ముళ్లూ..ఇది న్యాయమా అని అడుగుతున్నా..ఒక సంవత్సరం మనం కేంద్రానికి పన్నులు కట్టేది..ఆరువేల కోట్లు..ఈయన (మోదీ) ఇచ్చింది 1500 కోట్లు..కేసీఆర్ అంటాడు…నేను 500 కోట్లు ఇవ్వాలనుకున్నా..నరేంద్రమోదీ కోప్పడతాడని నేను ఇవ్వలేదు..అని ఆయన మాట్లాడుతున్నాడు..ఏంటీ నువ్వు భిక్షం వేస్తున్నావా..500 కోట్లు..ఎవడికి కావాలి నీ 500 కోట్లు..నా ఆస్తి లక్ష కోట్లు అంటూ ఆవేశంగా అసలు నిజం చెప్పేశాడు. దీంతో ఆస్తుల ప్రకటన చేసిన లోకేష్‌పై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. బాబు లోకేషూ.. నీవేమో మా నాయనకు ఇంత అప్పు… అంత అప్పు ఉందంటూ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ చెబుతావ్. కానీ మీ నాయన ఏమో నాకు లక్ష కోట్ల ఆస్తి ఉంది అని ఆయనే ఒప్పుకున్నాడు…అంటూ తెగ సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా లోకేష్ ఆస్తుల ప్రకటన నేపథ్యంలో నా ఆస్తి లక్ష కోట్లు అంటూ గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.