ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నికర ఆస్తి విలువ 3.87 కోట్లు అని ఆయన కుమారుడు ,మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు చెప్పారు. తమ కుటుంబ ఆస్తుల వివరాలను ఆయన ప్రకటించారు. చంద్రబాబు ఆస్తి విలువ తొమ్మిది కోట్ల వరకు ఉంటే, అప్పులు5.13 కోట్లు అని ఆయన తెలిపారు.
చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని ఆయన చెప్పారు. తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని వివరించారు.తన ఆస్తి విలువ 24 కోట్లు అని ఆయన వివరించారు. తన సతీమణి బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు, కుమారుడు దేవాన్ష్ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు ఆయన వివరించారు.
తాము తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నామని, వీటిని మించి ఉంటే తీసుకోవచ్చని చెప్పామని, ఎవరూ దానికి సమాదానం చెప్పలేకపోయారని అన్నారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై కేసులు ఉన్నాయని, బినామీ ఆస్తులు ఉన్నాయని ఆయన అన్నారు.తమ ఆస్తుల విలువ అవి సమకూరినప్పటి ఖరీదు అని ,మార్కెట్ విలువలు హెచ్చుతగ్గులు ఉంటాయని ఆయన అన్నారు.