Home / SLIDER / వారి ఆశీస్సులతోనే మంత్రినయ్యా.. మంత్రి సత్యవతి రాథోడ్

వారి ఆశీస్సులతోనే మంత్రినయ్యా.. మంత్రి సత్యవతి రాథోడ్

ఊరి జాతర అంటే ఉండబట్టలేని ఆనందం. జాతరకు వెళ్లాలనే ఆత్రం. జాతరలో పేలాలు, బొమ్మలు కొనడంలో ఉండే ఆనందం వేరు. ఊరి నుంచి ఎదిగి ఎంత ఉన్నత స్థాయికి వచ్చినా…ఊరికి వస్తే ఒదిగిపోవాల్సిందే… ఆ జాతర జ్ణాపకాల్లో తేలిపోవాల్సిందే…సరిగ్గా ఇదే దృష్యం కురివి శ్రీ వీరభద్ర స్వామి జాతరలో నేడు ఆవిష్కారమైంది. ఆమె రాష్ట్రానికి మంత్రి. కానీ వీరభధ్ర స్వామి జాతరకు చేరుకుని, స్వామిని దర్శించుకునేంత వరకే అలా ఉన్నారు. అనంతరం జాతరలో తాను చిన్నప్పుడు తిరిగిన దుకాణాలను, ఆ సందడిని చూసి ఆగలేకపోయారు. వెంటనే దుకాణంలోకి వెళ్లి గాజులు వేయించుకున్నారు. పేలాలు, స్వీట్లు కొన్నారు. పీక తీసుకుని ఊదారు. కుంకుమ దుకాణం వెళ్లి కుంకుమ కట్టించుకున్నారు. తన మనవరాలి కోసం బొమ్మలు కొన్నారు. కొన్న పీకను ఊదుతూ పాత జ్ణాపకాలను నెమరువేసుకుంటూ సందడి చేశారు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ –శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.

కురవి శ్రీ వీరభద్ర స్వామి జాతరతో రాష్ట్ర మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి 30 నుంచి 35 ఏళ్ల అనుబంధం ఉంది. తన చిన్నప్పటి నుంచి కుటుంబంతో కలిసి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్న భక్తి ఉంది. అయితే 30 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత శ్రీ కేసిఆర్ గారి ఆశీర్వాదంతో తెలంగాణ తొలి మహిళా మంత్రి అయ్యారు. రాష్ట్రంలో సగం మందిగా ఉన్న మహిళా శాఖకు, తను పుట్టి పెరిగిన గిరిజన శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మంత్రి అయ్యాక తొలిసారిగా కురవి శ్రీ వీరభద్ర స్వామి జాతర రావడంతో మంత్రి హోదాలో జాతరపై అధికారులతో సమీక్ష చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. జాతర రోజు నేడు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి బిందు, స్థానిక నేతలతో కలిసి వీరభద్ర స్వామిని, భధ్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా మహబూబాబాద్ వాసులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కురవి వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దీవెనలతో మంత్రిని అయ్యానన్నారు. గతంలో కేసీఆర్ గారు స్వయంగా వచ్చి కోర మీసాలు సమర్పిస్తానని వీరభద్ర స్వామికి మొక్కుకున్నారని, ఆయన మొక్కు రాష్ట్ర సాధన నెరవేరడంతో సీఎం అయ్యాక వచ్చి మీసాలు సమర్పించారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడి రైతులు సంతోషంగా ఉండాలని వారికి తాగునీరు, సాగునీరు ఇవ్వాలని సిఎం కేసిఆర్ ఆశించారని, నేడు ఎస్.ఆర్.ఎస్.పి ఒకటో దశ, రెండో దశ ద్వారా సాగునీరు వస్తోందని, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతోందని, డోర్నకల్ ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ గారు శ్రీ కురవి వీరభద్ర స్వామిని దర్శించుకున్నప్పుడు గుడి అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. అయితే ఈ నిధులు ఖర్చు చేయడంలో, గుడి అభివృద్ధి పనులు చేయడంతో మూడు జాతరలు పూర్తి అయినా…పనులు పూర్తి కాకపోవడం పట్ల అసంతృతప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ పనుల తీరును సమీక్షించి, ఇంకా అవసరమైతే సీఎం కేసీఆర్ గారిని అడిగి మరిన్ని నిధులు తెచ్చి ఈ దేవస్థాన భివృద్ధి కి మండల బిడ్డగా, మంత్రిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ గారు రాష్ట్రంలోనే దేవాలయాల అభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

మహబూబాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా స్వామివారు ఆశీర్వదించాలని ప్రార్థించానని చెప్పారు. సీఎం కేసీఆర్ గారి పేరు మీద ఉదయం అర్చన చేయించానని, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించేందుకు, అందరి ముఖాల్లో సంతోషం చూసేందుకు సీఎం కేసీఆర్ గారు చేస్తున్న కృషికి విజయం అందించాలని, ఆయనకు మరింత శక్తినివ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన భక్తులు మహాశివుణ్ణి పూజించి అనేక కోర్కెలు కోరుకుంటున్నారని.. వారి కోర్కెలు నెరవేరేవిధంగా ఆశీర్వదించాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు వివరించారు.
అనంతరం మహిళా – శిశు సంక్షేమ శాఖ అధికారులు రూపొందించిన ఆపదలో ఉన్న 18 ఏళ్ల లోపు బాలికల అభయ హస్తం 1098 పోస్టర్ విడుదల చేశారు. ప్లాస్టిక్ నివారించి, పర్యావరణ హితమైన బ్యాగులు వాడాలని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తయారుచేసిన సంచులు విడుదల చేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat