టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే ఐటీని నేనే కనిపెట్టా..సెల్‌ఫోన్ నేనే కనిపెట్టా..కంప్యూటర్ను నేనే కనిపెట్టా..అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఐటీ పేరు వింటేనే గజగజా వణికిపోతున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన స్టైల్లో పంచ్‌లు వేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రపై రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు కూడా కాకముందే…చంద్రబాబు రోడ్డెక్కి తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐటీ దాడుల నేపథ్యంలో వేలకోట్ల హవాలా, మనీలాండరింగ్ బాగోతాల్లో ఇరుక్కున్న చంద్రబాబుకు జైలుకు వెళ్తాననే భయం పట్టుకుందని ఆమె అన్నారు. అందుకే ఐటీ సోదాలు, దోపిడిపై మాట్లాడకుండా.. తేలు కుట్టిన దొంగల్లా చంద్రబాబు, లోకేష్ తిరుగుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవమాసాల పాలనతో నారావారి నవనాడులు చిట్లిపోయాయనితీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం 2 వేల కోట్ల ఐటీ స్కామ్‌పై ప్రజల దృష్టి మరలించేందుకే బస్ యాత్ర పేరుతో నవమోసాల పాలన అంటూ.. అబద్ధాలు చెబుతున్నాడని రోజా మండిపడ్డారు. ఐటీని తానే కనిపెట్టానని చెప్పుకునే బాబు.. ఇప్పుడు ఐటీ పేరు చెబుతేనే వణికిపోతున్నాడని సెటైర్లు వేశారు. మొత్తంగా చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
