Home / ANDHRAPRADESH / నారాలోకేష్ ఆస్తుల ప్రకటనపై గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

నారాలోకేష్ ఆస్తుల ప్రకటనపై గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో ఇటీవల జరిగి ఐటీ దాడుల్లో వేల కోట్ల హవాలా స్కామ్ బయటపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ తమ కుటుంబ ఆస్తులను హడావుడిగా ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, తన తల్లి నారా భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె ఆస్తులు తగ్గిపోయాయని లోకేష్‌ తెలిపారు. తనకు 8.14 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, తన పేరిట ఉన్న షేర్లను భార్య బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చానని ప్రకటించారు. గతంలో కంటే తన ఆస్తి 2.40 కోట్ల రూపాయల మేర తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు హయాంలో అమరావతి నుంచి ఓ నిర్మాణ సంస్థ నుంచి 400 కోట్లు హవాలా ద్వారా అందుకున్న జాతీయ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన తరుణంలో లోకేష్ తమ ఆస్తుల వివరాలను ప్రకటించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

తాజాగా లోకేష్ ఆస్తుల ప్రకటనపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని.. హడావుడిగా ఆస్తులను ప్రకటించడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఆస్తులన్నీ డుప్లికేటేనని, ఐటీ విచారణలో నిజాలు బయటపడుతున్నాయనే కారణంతో ఆస్తులు ప్రకటించారని విమర్శించారు. ‘చంద్రబాబు పీఎస్‌ ఇంట్లోనే దాడులు చేస్తే.. రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని..గత ఐదేళ్లలో దాదాపు 7 లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారని గడికోట ఆరోపించారు. తక్షణమే విదేశాల్లో ఉన్న బినామీ ఆస్తులను కూడా బయటపెట్టాలి’ అని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు చెప్పేవనీ శ్రీరంగనీతులు.. చేసేవన్నీ తప్పుడు పనులని శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు 100 తప్పులపై బీజేపీ ఛార్జ్‌షీట్‌ కూడా వేసిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతి సామ్రాట్‌ అని వామపక్షాలు పుస్తకం కూడా ముద్రించారన్నారు. అక్రమ ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారన్నారు. అమరావతి నుంచి అహ్మద్‌ పటేల్‌ వరకు జరిగిన హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించలేదని గడికోట నిలదీశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు.. కాంగ్రెస్‌కు ఎంత కప్పం కట్టారో బయటపడుతోందన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు జైలుకెళ్లక తప్పదని మండిపడ్డారు . రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ఒక మాఫియాను సృష్టించారు. ప్రతి నెలా రూ.5కోట్లు పెట్టి మాఫియాను నడిపిస్తున్నారని’ శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే ఆ మాఫియా వివరాలు బయటపెడతామని గడికోట తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును ఎల్లో మీడియా కాపాడుతుందని ధ్వజమెత్తారు. మొత్తంగా నారాలోకేష్ ఆస్తుల ప్రకటన రాజకీయంగా వివాదాస్పదంగా మారుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat