బుధవారం నాడు జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ సినిమాకు ఎన్టీఆర్ కన్నడ భామ రష్మికను పెట్టాలని అనుకున్నట్టు తెలుస్తుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గీతా గోవిందం సినిమాతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తరువాత టాప్ హీరో మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా రష్మిక ఛాన్స్ కొట్టేసింది. మరి ఎన్టీఆర్ సినిమాలో ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
