అబద్దాలు చెబుతూ ,చీ..ఛా అనిపించుకుంటూ బతకడం లో గొప్పదనం ఉందా? ఎందుకు ఈ అబద్దాల బతుకు అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో చంద్రబాబుకు అర్దం కావడం లేదని అన్నారు. పోయే కాలం వచ్చినట్లు ఉందని జనం అనుకుంటున్నారని ఆయన అన్నారు. రాస్ట్రంలో కరువు తీరి పంటలు పండి సంతోషంగా ఉంటే చంద్రబాబు ద్వేషంతో 320 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అబద్దాలు ప్రచారం చేయడం దారుణంగా ఉందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన పలు స్కీమ్ లను అంతా మెచ్చుకుంటుంటే చంద్రబాబు మాత్రం ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఐటి దాడులలో రెండువేల కోట్ల రూపాయలు బయటపడితే దాని గురించి మాట్లాడకుండా ఉండడానికి చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు.