కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ‘భారతీయుడు-2’. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై లో పూంతమల్లి పక్కన ఉన్న నజరత్పేట్లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 10మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకు కాజల్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఇలాంటి ఘటన జరగడం చాలా భాధాకరమని అన్నారు. ఆ ఘటన జరగక ముందు మేము అక్కడే షూటింగ్ లో పాల్గున్నామని. ఇంకొక 10 సెకండ్స్ అక్కడే ఉండిఉంటే ఆ క్రేన్ మాపై పడిఉండేదని మాకు తృటిలో ప్రమాదం తప్పిందని కాజల్ చెప్పింది.
