ఏపీ సీఎం జగన్ అక్రమాస్థుల కేసుల్లో త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు తమిళనాడులో శశికళను అరెస్ట్ చేయించినట్లు… కేంద్రం జగన్‌ను కూడా అరెస్ట్ చేయిస్తుందని ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు బురదజల్లుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఉండవల్లి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్‌కు, పీఎం మోదీకి చంద్రబాబు అంటే పడదు కాబట్టి..వీరిద్దరి మధ్య సఖ్యత ఉంటుందని ఉండవల్లి అన్నారు. కేంద్రంతో జాగ్రత్తగా డీల్ చేస్తూ..రాష్ట్రానికి కావల్సిన నిధులు తీసుకురాగలిగితే ఏపీలో జగన్ మరింతగా బలపడతారని ఉండవల్లి చెప్పారు. శశికళను జైల్లో పెట్టినట్లు కేంద్రం జగన్‌ను కూడా అరెస్ట్ చేయించే అవకాశం ఉంటుందని..ఒక ఎల్లోమీడియా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఉండవల్లి కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో జయలలితను శశికళే చంపించినట్లు ప్రజలు బలంగా నమ్మడంతో ఆమె గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయిందని…అందుకే శశికళను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తమిళనాడులో పెద్దగా వ్యతిరేకత రాలేదని ఉండవల్లి అన్నారు.
అయితే ఇప్పుడు వైయస్‌జగన్‌మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ, ప్రజల ప్రేమ పొందడంలో ఇండియాలోనే టాప్‌లీడర్, రాష్ట్ర ప్రజల్లో 51 శాతం ఆదరణ ఉన్న, అతనిని ఎవరూ ఏమీ చేయలేరని ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. శశికళను జైల్లో పెట్టినంత మాత్రాన జగన్‌ను జైల్లో పెట్టేంత దమ్ము కేంద్రప్రభుత్వానికి ఉండదని…ఉండవల్లి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోరిక అని పేర్కొన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ, రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని 14 ఏళ్ల క్రితమే వైఎస్సార్ ఆలోచన చేశారని ఈ సందర్భంగా ఉండవల్లి గుర్తు చేశారు. వైఎస్సార్ ఆలోచనను ఇప్పుడు జగన్ నిజం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని సూచించారు. ఈ విషయమై జగన్‌కు బుధవారం లేఖ రాశానని చెప్పారు. మొత్తంగా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం జగన్‌ను ఎవరూ టచ్ చేయలేరంటూ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.