టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అవే శ్రీరెడ్డికి చుక్కులు చూపిస్తున్నాయి. తనపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు. ఆమె డాన్స్ మాస్టర్ రాకేశ్ పై పేస్ బుక్ లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుందని బుధవారం నాడు ఆయనే వచ్చి పోలీసులకు పిర్యాదు చేసాడు. మరోపక్క మంగళవారం నాడు కరాటే కళ్యాణి కూడా శ్రీరెడ్డి పై పిర్యాదు చేసి సాక్షాలతో సహా పోలీసులు ముందు పెట్టింది. దాంతో పోలీసులు ఐటీ యాక్ట్ 67, సెక్షన్ 506 509 కింద కేసు నమోదు చేసారు. కేసు దర్యాప్తులో భాగంగా శ్రీరెడ్డి పేస్ బుక్ ఫూటేజ్ పరిశీలిస్తున్నారు.
