నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో భారీ విజయం సాధించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 62.1 కోట్ల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు)కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. వెలిగొండ రెండో టన్నెల్ పనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింది. రిత్విక్ సంస్థ 4.69 శాతం అధిక ధరకు పనులు దక్కించుకున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. ఈ ప్రక్రియలో భాగంగా రివర్స్ టెండరింగ్‌లో మేఘా సంస్థ 491.6 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్1గా నిలిచింది. 553.13 కోట్ల టెండర్‌ను 7 శాతం తక్కువకు దక్కించుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 87 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది.
