టాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికే చాటిచెప్పారు. అలాంటి దర్శకుడు ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ సినిమా తీస్తున్నాడు. దీనికి ఆర్ఆర్ఆర్ అని టైటిల్ పెట్టారు.ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మమోలుగా జక్కన్న సినిమా అంటే ఎవరికైనా ఊపు వస్తుంది. అదీ ఇద్దరు టాప్ హీరోస్ తో అంటే టాలీవుడ్ మొత్తం దిమ్మతిరిగిపోతుంది. ఇక ఇదంతా పక్కనపెడితే మరో విషయం ఏమిటంటే తాజాగా సినీ వర్గాల్లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేమిటంటే ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ సినిమా తరువాత మహేష్, ప్రభాస్ తో కలిసి తీయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదేగాని నిజమైతే అటు సూపర్ స్టార్, రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ పండగే అని చెప్పాలి.
