ఏపీలో 2వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం రేపుతుంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం బయటపడింది. ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు తాజాగా టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు నుండి ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తున్న విషయం అందరికి తెలిసిందే. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి పదిసార్లు మాట్లాడేవాడట. ఆ కాల్ లిస్టు బయటకు తీస్తే దోపిడీ సొమ్ము సర్ధుబాట్లపై మరింత సమాచారం బయటికొస్తుంది. 2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకు ప్రజా చైతన్య యాత్ర అంటూ కొత్త నాటకం మొదలెట్టాడు” అని అన్నారు.