కేశినేని నాని…టీడీపీలో ఉంటూ..చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగడుతున్న ఈ విజయవాడ ఎంపీ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక పక్క ప్రత్యర్థి పార్టీ వైసీపీని, సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూనే అదే స్థాయిలో చంద్రబాబు, లొకేష్‌లపై కూడా సెటైర్లు వేయడంలో కేశినేని నాని ఏ మాత్రం వెనకాడడం లేదు. తాజాగా విజయవాడలో ఎన్సార్సీ, సీఏఏకి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని సీఎం జగన్‌ను తిట్టబోయి ఏకంగా అధినేత చంద్రబాబునే అడ్డంగా ఇరికించేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీతో కలిసి ఎన్నార్సీ, సీఏఏ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ…. మోదీ సర్కార్ దేశంలో ఒక మతం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని, సీఏఏ, ఎన్ఆర్సీ తీసుకొస్తున్నారని నాని మండిపడ్డారు. తాను భారతీయుణ్ణి అని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే ఎన్ఆర్సీ, సీఏఏను వెనక్కి తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై నాని తీవ్ర విమర్శలు చేశారు. 22 మంది వైసీసీ ఎంపీలు సీఏఏకు అనుకూలంగా ఓటేశారని ఫైర్ అయ్యారు. అలాగే తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా సీఏఏకు అనుకూలంగా ఓటేశారని ఆక్షేపించారు. అయితే తాను మాత్రం వ్యతిరేకించి బయటికి వచ్చానని నాని చెప్పుకొచ్చారు.
అయితే తొలుత ఎన్సార్సీ, సీఏఏకి వైసీపీ మద్దతు తెలిపినా…ఆ చట్టంలోని కీలక అంశాలు బయటకు వచ్చిన తర్వాత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు సీఎం జగన్ ఎన్సార్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌కు ఒప్పుకునేది లేదని బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేరళ తరహాలోనే ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని కేశినేని నాని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు టీడీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలుకుతారని చెప్పారు. కేశినేని నాని చేసిన డిమాండ్‌తో చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే సీఏఏ, ఎన్ఆర్సీకి జగన్ వ్యతిరేకం అని ప్రకటించారు. ఈ మేరకు అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది..అదే జరిగితే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలకాల్సి ఉంటుంది..ఒక వేళ మద్దతు పలికితే..ఎక్కడ మోదీ, షాలకు ఎక్కడ కోపం వస్తుందనే భయం చంద్రబాబును వెంటాడుతోంది. మద్దతు ఇవ్వకపోతే…మైనారిటీ ఓటు బ్యాంక్ గల్లంతు అవుతాయి. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకునే పరిస్థితి ఎదురైంది.
ఇక వైసీపీ ఎన్డీయేలో చేరుతుంది..ఎన్సార్సీకి, సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేయలేదంటూ టీడీపీ, ఎల్లోమీడియా వాదిస్తోంది. అయితే ఒక వేళ వైసీపీ ఎన్డీయేలో చేరినా ఎన్నార్సీకి, సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేసే దమ్ము, ధైర్యం సీఎం జగన్‌కు ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను బలిపెట్టడానికి జగన్ ఇష్టపడడు. ఎటొచ్చి చంద్రబాబుకే ఇబ్బంది..మోదీకి దగ్గరవ్వాలని చూస్తున్న చంద్రబాబు ఎన్సార్సీ, సీఏఏని వ్యతిరేకించే ధైర్యం చేయడు..మొత్తంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎన్నార్సీ విషయంలో సీఎం జగన్‌ను ఇరికించబోయి..ఏకంగా తన అధినేత చంద్రబాబునే బుక్ చేశాడు. అంతేగాక చంద్రబాబును ఓడించేందుకు ఏపీకి కూడా వెళ్తామంటూ ఎన్నికల ముందు వ్యాఖ్యలు చేసిన ఓవైసీపై నాని ప్రశంసలు కురిపించడం కూడా టీడీపీకి కొంత ఇబ్బందికరంగా మారింది. మరి ఈ మ్యాటర్‌ను చంద్రబాబు ఎలా డీల్ చేస్తాడో చూడాలి.