తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో విశ్వేశ్వరయ్య భవన్ లో మంగళవారం “మైనింగ్స్ లో ఐటీ వినియోగం – ముందడుగు సదస్సు జరిగింది. ఈ సదస్సులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఆర్ సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ” ఐటీ వినియోగంలో సింగరేణి దేశంలోనే అగ్రగామిగా ఉంది.
అదే సమయంలో బొగ్గు ఉత్పత్తి ,టర్నోవర్ సాధించడంలోనూ ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు.రాబోయే కాలంలో ఐటీ వినియోగాన్ని విస్తృత పరుస్తూ .. అత్యాధునీక టెక్నాలజీతో ఉత్పత్తులు సాధిస్తూ 2024నాటికి వంద మిలియన్ టన్నుల లక్ష్యం సాధించాలని ఆయన సూచించారు.
ఈ & ఎం డైరెక్టర్ ఎస్ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కోల్ ఇండియా కంపెనీల ప్రతినిధులు, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు.