తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నయి. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా ఎనబై మూడు స్థానాలను దక్కించుకుంది.
ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలకు ఆకర్శితులై ఏకంగా ఇరవై రెండు మంది ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు.
దీంతో ప్రతిపక్ష పార్టీలకు రాజ్యసభ స్థానాల్లో పోటి చేసే అంత బలం లేదు.దీంతో టీఆర్ఎస్ పార్టీకే ఈ రెండు స్థానాలు దక్కనున్నాయి. త్వరలోనే రాజ్యసభ ఎంపీగా పదవీ కాలం పూర్తి చేసుకోనున్న ఆ పార్టీ సీనియర్ నేత కేకే మరోసారి తనకే అవకాశము వస్తుంది అని తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు అని సమాచారం. ఇక మిగిలిన ఒక స్థానానికి పార్టీలో చాలా పోటీ ఉంది.