ఈరోజుల్లో తెరపై హీరోయిన్ కనిపిస్తే చాలు ఎదో ఆమె మనపక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలాంటిది ఎదురుగా కనిపిస్తే అస్సలు ఊరుకోరు. అలాంటిది హీరోయిన్లు ప్రస్తుత రోజుల్లో ఏదైనా ఓపెనింగ్ కు వెళ్ళాలంటే భయపడుతున్నారట. ఇది స్వయంగా కొందరు హీరోయిన్లు చెప్పారట. ఒక ఈవెంట్ లేదా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళాలంటే వారికి రెండు లేదా మూడు లక్షలు ఇచ్చి తీసుకొస్తారు. ఎవరైనా షాప్ ఓపెనింగ్ కు హీరోయిన్ వస్తున్నారు అంటే అభిమానులు కుప్పలుగా వస్తారు. డబ్బులు ఇవ్వడం వారు రావడం అన్ని బాగానే ఉన్నాయి కాని ఆ వచ్చి ఉన్న గంటసేపు వారు చుక్కలు చూస్తారు అని చెబుతున్నారు. ఒక్కసారి అలాంటి వాటికి వెళ్తే జనాలు మధ్యలో ఎవరు ఎక్కడ చెయ్యి వేస్తారో కూడా తెలిదు. తెలియని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని అంటున్నారు. అందుకనే ఎంత డబ్బు ఇస్తామని చెప్పినా కొందరు వాటికి దూరంగా ఉంటారు.