రేఖ వ్యాదవ్యాస్..2001 లో మొదటిసారి కన్నడలో చిత్రా సినిమాలో నటించింది. అనంతరం ఆనందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో 30పైగా సినిమాల్లో ఆమె నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లోనే అందరిని మైమరిపించింది. ఆ తరువాత ఎందరో కొత్తవారు రావడంతో ఆమె కెరీర్ అక్కడితో ఆగిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తాజాగా చెప్పిన ఒక మాట అందరిని షాక్ కి గురిచేసింది. అదేమిటంటే నేనే గాని సీఎం అయితే పార్కులలో ఎవరైనా విచ్చలవిడిగా తిరిగేలా పర్మిషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంతకు ఈ విషయం ఎక్కడ చెప్పింది అంటే అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో చెప్పింది.
