పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అంటే టీడీపీకి మరో కుప్పం అని చెప్పవచ్చు.. ఎందుకంటే టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 9సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 9సార్లు కుప్పంలో గెలిస్తే ఉండి నియోజకవర్గంలో ఒక్కసారి మినహా (2004లో కాంగ్రెస్ అభ్యర్థి సర్రాజు గెలుపు) 8సార్లు టీడీపీనే గెలిచింది.
ఇన్నిసార్లు ఆదరించినా 14 సంవత్సరాలపాటు సీఎంగా చంద్రబాబు చేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే. ఒకసారి గెలిచిన సర్రాజు హయాంలో నియోజకవర్గంలో సుమారు 800 కోట్ల అభివృద్ధి పనులు చేసారు. అవి ఇప్పటికి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా ఓడించేసారు. గతంలో రెండుసార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక తాజా ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహ రాజును ఓడించినా ఎక్కడా మనకెందుకులే అని స్లో అవ్వకుండా మరింత ఉత్సాహంతో నియోజకవర్గం అభివృద్ధి పై దృష్ఠి పెట్టారు. అటు ఎంపీ గా గెలిచిన రఘురామకృష్ణం రాజు కూడా నియోజకవర్గ అభివృద్ధిపై మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
నియోజకవర్గంలో రోడ్డు, డ్రైనేజీ పనులు నిమిత్తం సుమారు 122 కోట్ల రూపాయలు పీవీఎల్, రఘురాజు నియోజకవర్గానికి సీఎం జగన్ ని రిక్వెస్ట్ చేసి నిధులు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో శంఖుస్థాపనలు చెయ్యడం, కొన్ని గ్రామాలలో రోడ్లు వెయ్యడం పూర్తి అయ్యాయి. కొన్ని గ్రామాలలో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు లేకపోతే ఇప్పటికే మొత్తం రోడ్లు, డ్రైన్లు పూర్తి అయ్యేవే. రాబోయే రోజుల్లో నియోజకవర్గం రూపు రేఖలు మార్చే యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది. జగన్ ముఖ్యమంత్రి కావటం, నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయినా పీవీల్ పట్టుదలతో అభివృద్ధి కోసం శ్రమిస్తుండటం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.