ఏపీలో వైసీపీ నేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పధకాలు ప్రవేశపెట్టే విషయంలో అందరికంటే ముందుగా ఉంటూ దూసుకుపోతున్నారు. వరసగా సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రజల్లో అప్పుడే దేవుడయ్యాడు. ఎక్కడ చూసిన జగన్ గురించే చర్చ…ఇక సోషల్ మీడియాలో అయితే హల్ చలే..తాజాగా ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమచారం. ఆ సంచలన నిర్ణయం ఏమీటంటే సమగ్ర భూసర్వే. 120 ఏళ్ల బ్రిటిష్ దొరల పాలనలో ఉండగా ఇలాంటి సమగ్ర భూసర్వేలు నిర్వహించేవారు. బ్రిటిష్ పాలన తరువాత రాజ్యాంగం ప్రకారం ప్రతి 30 సంవత్సరాలకు ఓసారి సమగ్ర సర్వే నిర్వహించాలి. కానీ, మన పాలకులు ఆ సర్వేలను పక్కన పెట్టేశారు. 1982 కు ముందు కొన్నాళ్ళు సర్వేలు జరిగాయి. ఆ తరువాత సమగ్ర భూసర్వేలను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో యథేచ్ఛగా భూదందాలు జరిగాయి. అయితే, 120 ఏళ్లనాటి సమగ్ర భూసర్వే వ్యవస్థను తిరిగి తీసుకురావాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. సమగ్ర భూసర్వేలను నిర్వహించి అసలు ఎవరి భూములు ఏంటి అనే విషయాలను తేల్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సర్వేను నిర్వహిస్తే… జగన్ రికార్డ్ సాధించినట్టే అని చెప్పుకోవచ్చు.
