ఫిబ్రవరి 19, 2020న ప్రకాశం జిల్లా మార్టూర్ మెయిన్ రోడ్డుపైప్రజాచైతన్య యాత్రలో భాగంగా ట్రాఫిక్ ఆపేసి సభ నిర్వహిస్తుండగా అక్కడికి 108 అంబులెన్స్ వచ్చింది. ప్రమాదంలో గాయపడ్డ గ్రానైట్ కార్మికుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అంబులెన్స్ సైరన్ విని కూడా స్పందించని చంద్రబాబు స్పందించలేదు. ఎన్నిసార్లు హారన్ కొట్టినా దారి ఇవ్వలేదు. దీంతో 108 అంబులెన్స్ తిరిలి వేరే రూట్లో వెళ్లిపోయింది. కాగా చావు బతుకుల్లో ఉన్న బాధితుడి పట్ల చంద్రబాబు కానీ, ఆ పార్టీ నేతలు కానీ కనీస మానవత్వం చూపలేదు. దీంతో చంద్రబాబు తీరుపై మండిపడుతున్న స్థానికులు మండిపడుతున్నారు. ఇదేనా 40 ఏళ్ల అనుభవం అంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
