అధికారం చేపట్టిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో వైసీపీ పాలనను, విధానాలను ఎండగట్టాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి ప్రజా చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఉదయం ప్రకాశం జిల్లాలో చంద్రబాబు చైతన్యయాత్రను ప్రారంభించనున్నారు. మార్టూరు, మేదరమెట్ల, ఒంగోలులో ప్రజలనుద్దేశించి బాబు ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు బొప్పూడి చేరుకోనున్న చంద్రబాబు అక్కడి ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేయనున్నారు. అనంతరం 11:30 గంటలకు ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించనున్నారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని, ప్రసంగించనున్నారు. ఆపై మధ్యాహ్నం 12:50 గంటలకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంపు ఆఫీసులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. 2:20 గంటలకు మేదరమెట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. రాత్రి 10 గంటలకు ఉండవల్లికి తిరుగు ప్రయాణంకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు టీడీపీ ప్రజాచైతన్య బస్సుయాత్ర చేయనుంది.