జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతీ సంక్షేమ పథకం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ వెళ్లడం జరుగుతుంది. మొదటి నుంచి చెప్తున్న ప్రకారం రాజకీయాలకు అతీతంగానే పథకాలు గానీ, అభివృద్ధి పనులు గానీ ప్రజలకు మేలు చెయ్యడం జరుగుతుంది. గతంలో జన్మభూమి కమిటీలు చెప్తేనే పనులు అయ్యేవి. అలాగే ఎమ్మెల్యే గ్రాంటు లు కూడా గత ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అప్పటి ప్రతిపక్ష వైస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నేరుగా నిధులు ఇవ్వడం ఓర్వలేక, ప్రజలు తమ ఓటు ద్వారా గెలిపించిన ఎమ్మెల్యే లకు నిధులు ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసారు. పైగా ఏ నియోజకవర్గంలోనైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయాడో ఆ అభ్యర్థిని నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమించి ఆయన పేరుమీద ఆ నియోజకవర్గంలో నిధులు మంజూరు చేసేవారు.
కానీ జగన్ అలా కాకుండా తన తండ్రి వైఎస్సార్ లానే టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గం అభివృద్ధి గ్రాంట్లు ఇస్తున్నారు. దానిలో భాగంగానే తాజాగా టీడీపీ నుండి గెలిచినఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చెయ్యడం జరిగింది. కుల, మత, పార్టీలకు అతీతంగా రాజకీయం చెయ్యాలంటే గొప్ప మనసు ఉండాలి. అటువంటి మనసు వైస్సార్ ఫ్యామిలీ లోనే ఉందని జగన్ మరోసారి రుజువు చేస్తున్నారు.