ఏపీ సీఎం జగన్ అడ్డా..పులివెందుల గడ్డ…దశాబ్దాలుగా వైయస్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం కంచుకోట…అక్కడ వైయస్‌కుకానీ… ఆయన తనయుడు జగన్‌కు కానీ ఎదురులేదు..పులివెందుల అంటే వైయస్ కుటుంబమే..అక్కడ వైయస్ ఫ్యామిలీకి ఎదురుగా పోటీ చేసేందుకే వెనుకాడుతారు..పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవు..జగన్ సొంత ఇలాకాలో ఇన్నాళ్లు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తాజాగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో టీడీపీ నేతలు జగన్‌కు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు వెనుకాడుతున్న తరుణంలో నేనున్నానంటూ సతీష్‌రెడ్డి వచ్చారు.. 2014, 2019లో సతీష్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి జగన్ చేతిలో పరాజయం పాలయ్యారు . అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సతీశ్ రెడ్డికి ఎమ్మెల్సీ తో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పదవులిచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసినా చంద్రబాబు రెండోసారి సతీష్‌రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. లోకేష్ సలహా మేరకు పులివెందుల నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవికి ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చిన చంద్రబాబు క్రమంగా సతీష్‌ను పక్కనపెట్టడం మొదలెట్టారు.దీంతో అప్పటి నుంచి లోకేశ్ తీరుపై సతీష్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీని వీడాలని సతీష్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే సతీష్ టీడీపీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అదే జరిగితే పులివెందులలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. అయితే సతీష్‌రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తుండడంతో ఆయనపై టీడీపీ నేతలు బురదజల్లడం ప్రారంభించారు. సతీశ్ రెడ్డి చేపట్టిన కాంట్రాక్టు పనుల బిల్లుల కోసమే అధికార పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సతీష్ రెడ్డి వైసీపీలో చేరితే..పులివెందులలో టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
