Home / ANDHRAPRADESH / కర్నూల్ నడి బొడ్డున టీడీపీ నేతలకు పట్ట పగలే చుక్కలు చూపించిన ..సీఎం జగన్

కర్నూల్ నడి బొడ్డున టీడీపీ నేతలకు పట్ట పగలే చుక్కలు చూపించిన ..సీఎం జగన్

కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రులు నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం అందించే దిశగా చేపట్టిన మూడో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మంగళవారం కర్నూలులో ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తమ ప్రభుత్వం మేలు చేస్తుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇంతమంచి పాలన చేస్తుంటే.. చూసి ఓర్చుకోని వారి సంఖ్య సాధారణంగా ఎక్కువగానే ఉంటుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు కడుపు మంటతో ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారన్నారు. ‘‘ఆరోగ్యశ్రీలో 2వేల వ్యాధులకు పైగా చికిత్స చేస్తున్నాం. ఇంకా క్యాన్సర్‌కు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం ఉంది. కానీ, అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు. కంటిచూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ, చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి కానీ, మెదడు కుళ్లితే మాత్రం చికిత్స లేనే లేదు. అలాంటి లక్షణాలున్న మనుషులను మహానుభావులుగా చూపించే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఉన్నాయి. వాటిని బాగు చేసే మందులు కూడా ఎక్కడా లేవు’’ అని చంద్రబాబు, ఎల్లోమీడియా తీరుపై వ్యంగ్యస్త్రాలు సంధించారు . ‘‘వీటన్నింటి మధ్య కూడా మీ బిడ్డ మీ కోసం పని చేస్తున్నాడు. నిజాయితీతో పని చేస్తున్నాడు మీ బిడ్డ జగన్ అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat