టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2000 కోట్ల స్కామ్‌పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీలనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాగా ఏపీ సీఎం జగన్‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులపై టీడీపీ, జనసేన రివర్స్ మాటలతో తప్పించుకోవాలని చూస్తున్నాయని జోగి రమేష్ ఫైర్ అయ్యారు. జనసేన అధినేత పవన్‌తో సహా, ఒక్కో టీడీపీ నేత పేరును ప్రస్తావిస్తూ తీవ్ర పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు.
ఏబీసీడీలు కూడా రాని టీడీపీ వెధవలందరూ సీఎం జగన్ ను, ఆయన కుటుంబాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. ప్రజలు చెంపచెళ్లుమనిపిస్తే నాలుగు నెలలపాటు కుక్కినపేనుల్లా బొక్కల్లో పడుకున్న టీడీపీ వాళ్లు మళ్లీ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి చెత్తవాగుడు వాగుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి నోరు జారితే ఇంటికొచ్చి తంతాం.. దేవినేని ఉమ అనేవాడు పెద్ద సొల్లుగాడు. నాలుగు నెలలు కుక్కలాగా పడుండి, ఇప్పుడు మీడియాలో రెచ్చిపోతున్నాడు. పోలవరం కట్టింది ఎవడ్రా? అని అడుగుతాడా? ముఖ్యమంత్రిని ఉద్దేశించి రా అని సంబోధించడానికి ఎంత ధైర్యం? ఏయ్.. దేవినేని ఉమ.. ఇంకోసారిగానీ నోరు జారితే.. నీ ఇంటికే వచ్చి తోక కత్తిరిస్తా జాగ్రత్త.. అని జోగి రమేష్ పరుష పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతల తీరు ఎలా ఉందంటే.. ఒకరేమో బుద్ధి లేని లొల్లి వెంకన్న.. ఇంకొకరు సొల్లు ఉమ.. మెదడులేని మేధావి యనమల రామకృష్ణుడు.. అచ్చోసిన ఆంబోతు అచ్చెంనాయుడు.. లోకజ్ఞానం లేని నారా లోకేశ్.. బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి. పొద్దునలేస్తే కారు కూతలు కూస్తోన్న వీళ్లందరికీ త్వరలోనే గట్టి షాక్ తగులుతుందని జోగి రమేష్ తీవ్రంగా దుయ్యబట్టారు.
త్వరలోనే ఐటీ దాడుల్లో చంద్రబాబు అక్రమాలన్నీ బయటికొస్తాయి. ఐటీ దాడుల్లో చంద్రబాబు మాజీ పీఏ అడ్డంగా దొరికిపోతే దాంతో సంబంధంలేదని టీడీపీ నేతలెలా చెబుతారు? రూ.2వేల కోట్ల అక్రమాలపై దేశమంతా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ స్పందించరేం? ప్రెస్ మీట్ లో సూట్ కేసులు చూపించి ఇందులో డబ్బులు పడతాయా? అని టీడీపీ నేతలు చౌకబారు కూతలు కూస్తున్నారు..అయితే డబ్బులు సూట్ కేసుల్లోకాదు.. సూట్ కేస్ కంపెనీల ద్వారా దారిమళ్లాయని ఐటీ శాఖనే చెబుతోంది అని కౌంటర్ ఇచ్చారు.
ఇక వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కూడా జోగి రమేష్ విరుచుకుపడ్డారు. మీకు పీకే.. నాకు అదే.. టీడీపీ నేతలకు తోడుగా చంద్రబాబు తాబేదారు పీకే కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. పీకే అంటే అందరికీ పవన్ కల్యాణ్ కావొచ్చేమో.. నాకు మాత్రం పీకే అంటే పిచ్చి కుక్కే. కరోనా వైరస్‌కైనా మందు కనిపెట్టారేమోగానీ.. ఈ పీకే లాంటి పిచ్చికుక్కల్ని నివారించడానికి మందు రాలేదింకా అంటూ జోగిరమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు.. బీజేపీతో వైసీపీ కలిస్తే నేను దూరమైపోతానని పవన్ అంటున్నాడు. అసలు ఎన్డీఏలోకి వైసీపీ చేరుతుందని ఆయనకు ఎవరు చెప్పారు? రాజధాని రైతులకు ఏం చేస్తానో చెప్పకుండా ఈ చెత్తవాగుడేంటి? దేశం మొత్తాన్ని ఊపేస్తున్న ఐటీ దాడులపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? పవన్ మాటలకు, చేతలకు పొంతనే ఉండదు. ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్” అని జోగి రమేశ్ అన్నారు సీఎం సతీమణి వైఎస్ భారతి గురించి అవాకులు చెవాకులు రాసినా, మాట్లాడినా టీడీపీ నేతల తాటతీస్తామని ఆయన హెచ్చరించారు. దేశ ప్రధానితో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం కావడంపైనా రాద్ధాంతం చేస్తోన్న టీడీపీ నేతలు పిచ్చికుక్కల్లా తయారయ్యారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం పవన్‌తో సహా, మరీ టీడీపీ నేతలను పేరు పేరు పెట్టి జోగి రమేష్ తిట్టిన వైనం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.