తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ శివారులోని కాకతీయ కాల్వ వద్ద మరో కారు ప్రమాదం కలకలం రేపింది. మొన్న ఆదివారం రాత్రి కాల్వలో బైకు పడిన ఘటనలో మహిళ భౌతికకాయం కోసం కాల్వకు నీటిని నిలిపేయగా.. సోమవారం కాల్వలో తేలిన ఓ కారులో ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
వీరం తా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి కాకతీయ కాల్వకు అధికారులు నీటిని నిలిపేశారు. ఈక్రమంలో తిమ్మాపూర్ మండలంలోని యాదవులపల్లె సమీపంలో కాల్వలో ఓ కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్రేన్‌సాయంతో కారును బయటకు తీశారు.
అందులో కుళ్లిన స్థితిలో ఉన్న మూడు మృతదేహాలను గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలోని బ్యాంకుకాలనీకి చెందిన నరెడ్డి సత్యనారాయణరెడ్డి(55), ఆయన భార్య రాధ(50), కుమార్తె వినయశ్రీ(25)గా గుర్తించారు. వీరు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబ సభ్యులు గా తెలుసుకున్న పోలీసులు విషయాన్ని ఎమ్మెల్యేకు, బంధువులకు చెప్పారు.