తెలంగాణ రాష్ట్రంలో 2020-21ఏడాదికి చెందిన ఆర్థిక బడ్జెట్ ను మార్చి నెలలో ప్రవేశపెట్టే వీలున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను మార్చి నెల ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి నోటీసులు కూడా పంపారని సమాచారం. మార్చి ఆరో తారీఖున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మొదటి రోజున అసెంబ్లీ,శాసనమండలిని ఉద్ధేశించి గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు. అనంతరం ఎనిమిదో తారీఖున తొలుత అసెంబ్లీలో ఆ తర్వాత మండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశముంది.