Home / ANDHRAPRADESH / సంచలనం… 2 వేల కోట్ల స్కామ్‌పై రంగంలోకి దిగిన ఈడీ… చిక్కుల్లో చంద్రబాబు..!

సంచలనం… 2 వేల కోట్ల స్కామ్‌పై రంగంలోకి దిగిన ఈడీ… చిక్కుల్లో చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడులపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఒక రాజకీయ ప్రముఖుడి పీఎస్‌పై జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల అక్రమలావాదేవీల స్కామ్ బయటపడిందని, హవాలా ద్వారా విదేశాలకు నల్లడబ్బును తరలించారని, దీని వెనుక పెద్ద ఎత్తున మనీల్యాండరింగ్ వ్యవహారం దాగి వుందని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ ప్రెస్‌నోట్‌ ఆధారంగా 2 వేల కోట్ల అవినీతి స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ చేత విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే టీడీపీ నేతలు మాత్రం కేవలం 2 లక్షలే దొరికాయంటూ బుకాయిస్తున్నారు. అయితే 13 పేజీల పూర్తి స్థాయి పంచనామా బయటకు రావడంతో టీడీపీ నేతలు ఒక్క పేజీని మాత్రమే చూపించి కేవలం 2 లక్షలే దొరికాయంటూ అడ్డగోలుగా వాదిస్తున్నట్లు తేలిపోయింది.

ఇదిలా ఉంటే ఐటీ శాఖ సోదాల్లో భారీగా హవాలా, మనీలాండరింగ్ వ్యవహారాలు ఉన్నట్లు తేలడంతో ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. గత ఐదేళ్లలో టీడీపీ పెద్దలు పెద్ద ఎత్తున ప్రభుత్వ పనులను భారీగా ఎస్టిమేషన్లు పెంచి కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టారని, ప్రతిగా కమీషన్ల పేరుతో వేలాది కోట్లను షెల్‌ కంపెనీల పేరుతో హవాలా ద్వారా విదేశాలకు తరలించారని, తిరిగి ఆ అక్రమ సొమ్మును విదేశీ పెట్టుబడుల పేరుతో…. టీడీపీ పెద్దల బినామీల కాంట్రాక్ట్ సంస్థలకు మళ్లించి…తమ ఖాతాల్లోకి వేసుకున్నారని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. టీడీపీ సర్కార్ హయాంలో కొన్ని కొన్ని కాంట్రాక్టు సంస్థలు నకిలీ బిల్లులను క్రియేట్ చేసి భారీగా ప్రభుత్వం నుంచి సొమ్ములు పొందాయనే విషయాన్ని కొన్ని నెలల కిందటే ఐటీ, ఈడీలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఈ వ్యవహారంలో ఏపీ మూలాలు దొరికాయని, వాటి ఆధారంగానే ఐటీ రైడ్స్ జరిగాయని చర్చ జరుగుతోంది.

కాగా చంద్రబాబు మాజీపీఎస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో భారీగా హవాలా, మనీలాండరింగ్‌ జరిగిందని గుర్తించిన ఈడీ రంగంలోకి దిగుతోందని సమాచారం. ఇప్పటికే గత వారం చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్ ఇంటిపై, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలపై జరిపిన సోదాల్లో 1000 డాక్యుమెంట్లు, ఆభరణాలు, బ్యాంకులాకర్లు, వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. వీటిపై కూలంకుశంగా విచారణ జరుపనున్నారు. ఇప్పుడు ఈ స్కామ్ వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగుతుండడంతో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 2 వేల కోట్ల స్కామ్‌లో ఈడీ ఎంటర్ అయిందంటూ వస్తున్నవార్తలతో టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat