జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఏకంగా ప్రజలనే తప్పుపడుతూ ఆయన మాట్లాడారు.. ఐటీ అధికారులు చంద్రబాబు మాజీ పీఎస్ ఇంటిపై ఏకకాలంలో సోదాలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే శ్రీనివాస్ దగ్గర నుండి ఐటీ అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓటు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని అలాంటివారికి ఎదుటివారి అవినీతిని ప్రశ్నించే నైతికత ఎక్కడిదంటూ మాట్లాడారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976 లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేక పోతున్నారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితం లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడు. పిఎస్ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదట. కట్టప్పను మించి పోయాడు” అని కామెంట్ చేసారు.
